KOHLI: క్రికెట్‌లో ముగిసిన కోహ్లీ శకం

టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు. దీని నుంచి తేరుకునేలోపే మరో దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. కీలకమైన ఇంగ్లాండ్ పర్యటన ముంగిట కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకడం అందరినీ షాక్ కు గురిచేసింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని బీసీసీఐ సూచించినా.. విరాట్ వెన్కక్కి తగ్గలేదు.
కోహ్లీ.. ఫర్‌ఎవర్
భారత టెస్ట్ క్రికెట్ హిస్టరీలో మరో శకం ముగిసింది. టెస్టుల్లో కోహ్లీ మంత్రముగ్ధులను చేసిన ఎన్నో ఇన్నింగ్స్ అభిమానుల మదిలో నిలిచిపోతాయి. 111 టెస్టుల్లో 8,848 పరుగులు చేసిన అతను, 29 శతకాలు కొట్టాడు. 2014లో ఆస్ట్రేలియాలో టెస్టు కెప్టెన్సీ చేపట్టిన కోహ్లీ 2022 వరకు టీంకు 40 విజయాలు అందించాడు. భారత్‌కు 269 ప్లేయర్‌గా రిప్రజెంట్ చేసిన ఆయన ఫర్‌ఎవర్‌గా నిలిచిపోయాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com