Virat Kohli : దేశంలోనే టాప్ స్పోర్ట్స్ ట్యాక్స్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ

Virat Kohli : దేశంలోనే టాప్ స్పోర్ట్స్ ట్యాక్స్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లి స్పోర్ట్ విభాగంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా నిలిచారు. 2024, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆయన 66 కోట్ల రూపాయల పన్ను చెల్లించారు. అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న సెలబ్రిటీల జాబితాలో విరాట్ కోహ్లి 5వ స్థానంలో ఉన్నారు.

ఈ జాబితాలో ప్రముఖ హీరో షారూఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన 92 కోట్ల రూపాయల పన్ను చెల్లించారు. రెండో స్థానంలో ఉన్న తమిళ హీరో విజయ్ 80 కోట్ల రూపాయలు చెల్లించారు. మూడో స్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్ 75 కోట్ల రూపాయల పన్ను చెల్లించారు. అమితాబ్ బచ్చన్ 71 కోట్ల పన్ను చెల్లించారు.

స్పోర్ట్స్ విభాగంలో మరో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 38 కోట్ల రూపాయల ఆదాయ పన్ను చెల్లించారు. సచిన్ టెండుల్కర్ 28 కోట్లు చెల్లించారు. మరో క్రికెటర్ హార్థిక్ పాండ్య 13 కోట్లు, రిషబ్ పంత్ 10 కోట్లు ఆదాయ పన్ను చెల్లించారు. బీసీసీఐ అధ్యక్షుడుగా ఉన్న సౌరవ్ గంగూలీ 23 కోట్లు చెల్లించారు.

Tags

Next Story