Virat Kohli : కోహ్లీ స్లెడ్జింగ్... ఆసీస్ ఓపెనర్ రియాక్షన్ చూసారా..?

Virat Kohli : కోహ్లీ స్లెడ్జింగ్... ఆసీస్ ఓపెనర్ రియాక్షన్ చూసారా..?
X

ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్, విరాట్ కోహ్లీ మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడం, దానికి ఐసీసీ విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకోవడం తెలిసిందే. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాగా విధించిన ఐసీసీ..అతడి ఖాతాలో ఒక డీ మెరిట్ పాయింట్‌ను జోడించింది. మరో పక్క వీరి మధ్య వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై సామ్ కాన్‌స్టాస్ స్పందిస్తూ.. తాము ఇద్దరం కాస్త భావోద్వేగానికి గురయ్యామని అనిపిస్తోందన్నాడు. విరాట్ వస్తున్నట్లు తాను గమనించలేదని, గ్లవ్స్‌ను సరిచేసుకునే పనిలో ఉండగా ఇది జరిగిందన్నారు. అయితే, క్రికెట్‌లో ఇలా జరుగుతూ ఉంటుందని, ఇదేమీ పెద్ద సమస్య కాదని కాన్‌స్టాస్ చెప్పారు. ఈ వీడియో క్రికెట్ అభిమానుల గ్రూప్స్ లో తెగ తిరుగుతోంది.

Tags

Next Story