Virendra Sehwag : టీమిండియాలో మెరుగైన స్పిన్నర్ లేడు : వీరేంద్ర సెహ్వాగ్

Virendra Sehwag : టీమిండియాలో మెరుగైన స్పిన్నర్ లేడు : వీరేంద్ర సెహ్వాగ్

ప్రస్తుత భారత క్రికెట్ టీమ్ లో ఒక్క మెరుగైన స్పిన్నర్ లేడని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఉన్న టీమిండియా బ్యాట్స్ మెన్ స్పిన్ బౌలింగ్ ను ఫేస్ చేయడంలో ఇబ్బందిపడుతున్నట్లు పేర్కొన్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత బ్యాటర్లు స్పిన్‌కు లొంగిపోయారన్నాడు. రోహిత్, విరాట్‌ కోహ్లీతో సహా ప్రతిఒక్కరూ స్పిన్‌ను ఆడలేకపోయారు. దీనికి కారణం దేశవాళీ నుంచి మెరుగైన స్పిన్నర్లు రాకపోవడమేనని సెహ్వాగ్ తెలిపాడు. ‘భారత్‌ నుంచి అత్యుత్తమ స్పిన్నర్లు రాకపోవడానికి ప్రధాన కారణం ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటమే. టీ20ల్లో కేవలం 24 బంతులను మాత్రమే వేసే అవకాశం ఉంది. దీంతో బంతిని ఫ్లైట్ చేసి విసిరే చాన్స్ ఉండదు. బ్యాటర్లను ఔట్ చేసే స్కిల్స్ సాధించడం కష్టంగా మారింది. ఇక భారత క్రికెటర్లూ అతి తక్కువగానే దేశవాళీలో ఆడుతున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కంటే దేశవాళీలోనే ఎక్కువ స్పిన్‌ను ఆడే అవకాశం దొరుకుతుంది. భారత బ్యాటర్లు స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే దేశవాళీ క్రికెట్‌ బెస్ట్. మా టైమ్ లో సచిన్, గంగూలీ, లక్ష్మణ్, ద్రవిడ్, యువీ.. అందరూ దేశవాళీలో ఆడేవాళ్లం. వన్డే లేదా నాలుగు రోజుల గేమ్‌లను ఆడటం వల్ల ఇంటర్నేషనల్‌ మ్యాచ్ ల్లోనూ స్పిన్‌ను ఎదుర్కొనేవాళ్లం. ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో ప్లేయర్లకు ఆడే చాన్స్ ఉండట్లేదు’ అని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.

Tags

Next Story