Mohammed Siraj : భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌పై సిరాజ్ ఏమన్నాడంటే..?

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ 4వ మ్యాచ్ రద్దు తర్వాత.. భారత్ -, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. జూలై 20న బర్మింగ్‌హామ్‌లో ఇండియా ఛాంపియన్స్ - పాకిస్తాన్ ఛాంపియన్స్ తలపడాల్సి ఉంది. కానీ టీమిండియా మాజీ ఆటగాళ్ళు మ్యాచ్ నుండి వైదొలగడంతో మ్యాచ్ రద్దు అయ్యింది. దీనికి సంబంధించి పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహమ్మద్ సిరాజ్ సమాధానం ఏమిటి?
తనకు ఆ మ్యాచ్ గురించి ఏమీ తెలియదని సిరాజ్ చెప్పాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ గురించి ఎటువంటి సమాచారం లేదు కాబట్టి.. దాని గురించి మాట్లాడటం సరికాదన్నాడు.
భారత్-ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్:
4వ టెస్ట్ మ్యాచ్‌లో సిరాజ్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఆడతాడని సిరాజ్ చెప్పాడు. అంతకుముందు, బుమ్రాకు 4వ టెస్ట్ మ్యాచ్‌కు నుంచి విశ్రాంతి ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సిరాజ్ మాత్రం.. బుమ్రా మాంచెస్టర్‌లో ఆడతాడని స్పష్టం చేశాడు. అయితే మూడో పేసర్‌గా ఎవరనీ తీసుకుంటారన్నదానిపై క్లారిటీ లేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com