World Cup 2023: బంగ్లాదేశ్ భారత్‌ను ఓడిస్తే డిన్నర్ డేట్ ప్రామిస్ చేసిన నటి.. ఎవరీ సెహర్ షిన్వారీ

World Cup 2023: పాకిస్థానీ నటి సెహర్ షిన్వారీ ఇటీవలి ప్రపంచ కప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారత్‌ను ఓడిస్తుందని శపథం చేసి వార్తల్లో నిలిచింది. పాకిస్థాన్ ఓటమికి 'ప్రతీకారం' తీర్చుకుంటే బంగ్లాదేశ్ క్రికెటర్‌తో డేట్‌కి వెళ్తానని ఆమె చెప్పింది. సెహర్ తన వాదనలతో సంచలనం సృష్టించడం ఇది మొదటిసారి కాదు. గతంలో, నటి ఆసియా కప్ 2023లో భారత్‌పై పాకిస్తాన్ ఓటమి చెందడం ఆమెను కలచి వేసింది. దాంతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తానని పేర్కొంది.
ఇలాంటి మాటలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది తప్ప ఆమె గురించి పాక్ ప్రజలకు పెద్దగా తెలియదు. ఆమె పాకిస్తానీ టెలివిజన్ నటి, సామాజిక కార్యకర్త కూడా. సెహర్ కి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అక్కడ ఆమె తరచుగా వ్లాగ్‌లు, షార్ట్‌లను అప్‌లోడ్ చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 31K మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె 145K కంటే ఎక్కువ మంది ఫాలోయింగ్‌తో గతంలో ట్విట్టర్ అని పిలిచే Xలో అత్యంత ప్రజాదరణ పొందింది. సెహర్ షిన్వారీ 'సైర్ సావా సైర్', 'ఖుబూనా నా మ్రీ' మరికొన్ని ఇతర సీరియల్‌లలో పనిచేసినందుకుగాను గుర్తింపు పొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com