Womens T20 World Cup : వరల్డ్ కప్ లో ఇండియా ఫస్ట్ ఫైట్ ఎవరితో? తెలుసుకోండి

X
By - Manikanta |20 Jun 2025 11:00 AM IST
పాకిస్థాన్ పోరుతో భారత జట్టు 2026 మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్ వేటను ఆరంభించనుంది. జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఐసీసీ, ఆతిథ్య ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బుధవారం టోర్నీ షెడ్యూలును ప్రకటించాయి. ప్రపంచకప్‌లో12 జట్లు పోటీపడతాయి. 24 రోజుల పాటు సాగే ఈ టోర్నీ వచ్చే ఏడాది జూన్ 12న ఆరంభమవుతుంది. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతుంది. మొత్తం 33 మ్యాచ్‌లను ఇంగ్లాండ్‌లో ఏడు వేదికల్లో ఆడతారు. ఎడ్జ్‌బాస్టన్‌తో పాటు హాంప్‌షైర్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్, ద ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్ ప్రపంచకప్ వేదికలు. జూన్ 30, జులై 2వ తేదీల్లో సెమీఫైనల్స్, జులై 5న లార్డ్స్‌లో ఫైనల్ జరుగుతాయి.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com