BUMRAH: టీమిండియా కెప్టెన్ గా బుమ్రా..!

BUMRAH: టీమిండియా కెప్టెన్ గా బుమ్రా..!
X
పెరుగుతున్న డిమాండ్లు... అనవసర ఒత్తిడి పెంచొద్దన్న మాజీలు

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా – ఇండియా జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భారత పరాజయం తర్వాత.. రోహిత్ సేనపై విమర్శల జడివాన కురుస్తోంది. ఈ సిరీస్ లో సిడ్నీ వేదికగా జరిగిన చివరి ఐదవ టెస్ట్ కి రెస్ట్ పేరుతో కెప్టెన్ రోహిత్ శర్మని బెంచ్ కి పరిమితం చేశారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ బరిలోకి దిగలేదు. కానీ తనంతట తానే ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నానని రోహిత్ శర్మ ప్రకటించాడు. అయితే టెస్టు ఫార్మాట్ లో రోహిత్ శర్మ శకం ముగిసినట్లేనన్న వార్తలు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రోహిత్, కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

రోహిత్ వారసుడు బుమ్రానే..

రోహిత్ శర్మకు వారసుడిగా, లాంగ్ టెర్మ్ కెప్టెన్ గా బుమ్రాకు పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ లు వినిపిస్తున్నాయి. కానీ కొంతమంది మాజీలు మాత్రం బుమ్రాపై అనవసర ఒత్తిడి పెట్టొద్దని వ్యాఖ్యానించారు. అయితే బీసీసీఐ రివ్యూ మీటింగ్ లో కొత్త కెప్టెన్ గా బుమ్రా పేరును ప్రతిపాదించారని తెలుస్తోందికానీ బుమ్రాకు నాయకత్వం అప్పగించేందుకు కొంతమంది విముఖత చూపారట. మరి కొన్ని నెలల పాటు తననే కెప్టెన్ గా కొనసాగించాలని రోహిత్ శర్మ తాజాగా బీసీసీఐ రివ్యూ మీటింగ్ లో కోరినట్లు తెలిసింది. అలానే కొత్త కెప్టెన్ ను వెతకాలని బీసీసీకి రోహిత్ శర్మ చెప్పినట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను టీమిండియా కోల్పోవడంపై బీసీసీఐ సమీక్ష చేసింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీతో పాటు కోచ్‌ గౌతమ్‌ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ సమావేశానికి హాజరయ్యారు.

బుమ్రాపై వ్యతిరేకత ఎక్కడంటే..

బుమ్రా తరచుగా గాయల బారిన పడుతుంటాడు. రీసెంట్ గా కూడా జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో అతడు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ టూర్ లో 150కిపైగా ఓవర్లను వేసిన అతడు వెన్ను నొప్పి కారణంగా సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ ఆడటంపై అనుమానాలు మొదలయ్యాయి. అందుకే బుమ్రాకు ఫిట్ నెస్ సమస్యలు ఉన్న నేపథ్యంలో అతడికి పూర్తి స్థాయి కెపెన్సీ బాధ్యతలు అప్పగించడం సరైనది కాదని కొంతమంది అభిప్రాయపడ్డారని తెలిసింది.

వైస్ కెప్టెన్ గా వారిలో ఒకడే..

టీమిండియా ప్రస్తుతం సంధి దశలో ఉంది. కెప్టెన్ రోహిత్, కోహ్లీ వీడ్కోలు పలికేందుకు సిద్ధవుతుండగా.. ఇప్పటికే అశ్విన్ వీడ్కోలు పలికేశాడు. దీంతో భారత టెస్ట్ టీమ్‌కు రెగ్యులర్ వైస్ కెప్టెన్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. లాంగ్ ఫార్మాట్‌లో రోహిత్‌కు వారసుడిగా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను నియమించాలని చూస్తోంది. వైస్ కెప్టెన్‌గా పంత్-జైస్వాల్‌లో ఒకర్ని ఎంచుకోవాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారట.

Tags

Next Story