Rohit Sharma : ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్‌మెంట్?

ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వాలని బోర్డు ఇప్పటికే రోహిత్‌కు సూచించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం రోహిత్ తన రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆధారంగా కొత్త సారథిని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.
ఫిబ్రవరి 20 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా తన పోరాటాన్ని ప్రారంభించనుంది. దీనికి ముందు, ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ వన్డే సిరీస్‌లో కూడా టీం ఇండియాకు రోహిత్ శర్మనే నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో రాణించడం ద్వారా తనపై వస్తోన్న విమర్శలకు రోహిత్ జవాబు చెప్పాలని అతని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com