CT: బుమ్రా లేకపోతే టీమిండియాకు కష్టమే

CT: బుమ్రా లేకపోతే టీమిండియాకు కష్టమే
X
బుమ్రా స్థానం భర్తీ చేయడం కష్టమన్న మాజీలు.. హర్షిత్ రాణాపై ఒత్తిడి పెరుగుతుందన్న అంచనాలు...

ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం కావడం టీమిండియాకు భారీ ఎదురు దెబ్బే అని... భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అన్నాడు. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా మంచి ప్రదర్శనే చేస్తున్నా... బుమ్రా ప్లేస్‌ను భర్తీ చేయడం తేలికైన విషయం కాదని స్పష్టం చేశాడు. కొత్త బంతితో హర్షిత్ ఎక్కువగా వికెట్లు తీయలేదని గుర్తు చేసిన పార్థివ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో హర్షిత్‌ రాణించాలన్నాడు.

హర్షిత్ రాణాపై పెరిగిన ఒత్తిడి

ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణాపై ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోనే వన్డేల్లోకి అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా.. మెరుగైన ప్రదర్శనే ఇచ్చాడు. ఇప్పుడు అదే ప్రదర్శన ఛాంపియన్స్ ట్రోఫీలో పునరావృతం చేస్తాడో లేదో చూడాలి. పాత బంతితో ప్రమాదకరంగా కనిపించే హర్షిత్.. కొత్త బంతితో ఏ మేర రాణిస్తాడో చూడాలి.

శ్రేయస్ బ్యాటింగ్ పై బంగర్ కామెంట్స్

శ్రేయస్ అయ్యర్ ఆటతీరుపై అని భారత మాజీ కోచ్ సంజయ్‌ బంగర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో శ్రేయస్‌ అయ్యర్ షార్ట్‌ పిచ్‌ బంతిని ఆడటంలో ఇబ్బంది పడ్డాడని... ఇప్పుడు ఆ బలహీనతను అధిగమించాడని వెల్లడించాడు. గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని బంగర్ తెలిపాడు. అతడి బాడీ లాంగ్వేజ్ కూడా గతంతో పోలిస్తే మెరుగ్గా అనిపించిందని అభిప్రాయపడ్డాడు

RCB కొత్త కెప్టెన్సీపై విరాట్ స్పందన

IPL-2025 టోర్నీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త కెప్టెన్ సారథ్యంలో నడవనుంది. రజత్ పాటిదార్‌ను RCB కెప్టెన్‌గా యాజమాన్యం నియమించిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ స్పందించారు. 'నాతో పాటు జట్టు సభ్యులందరం మీ వెంటే ఉంటాం. ఈ ఫ్రాంచైజీలో మీరు ఎదిగిన విధానం, మీరు ప్రదర్శించిన తీరుతో RCB అభిమానులందరి గుండెల్లో స్థానం సంపాదించారు. దీనికి మీరు అర్హులు' అని కోహ్లీ ఓ వీడియో విడుదల చేశారు.

Tags

Next Story