WWC2025: టీమిండియా.. ప్రపంచ ఛాంపియన్

WWC2025: టీమిండియా.. ప్రపంచ ఛాంపియన్
X
వరల్డ్ కప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికా చిత్తు.. 298 రన్స్ చేసిన టీమిండియా.. 246 పరుగులకే కుప్పకూలిన ప్రొటీస్

మహి­ళల ప్ర­పం­చ­క­ప్‌­లో భారత అమ్మా­యి­లు చరి­త్ర సృ­ష్టిం­చా­రు. 47 ఏళ్ల ని­రీ­క్ష­ణ­కు తె­ర­దిం­చు­తూ తొ­లి­సా­రి ప్ర­పం­చ­క­ప్‌­ను ము­ద్దా­డా­రు. ముం­బ­యి వే­ది­క­గా ఉద్వి­గ్న­భ­రి­తం­గా సా­గిన ఫై­న­ల్‌­లో భారత జట్టు దక్షి­ణా­ఫ్రి­కా­పై 52 పరు­గుల తే­డా­తో ఘన­వి­జ­యం సా­ధిం­చిం­ది. షె­ఫా­లీ వర్మ (87 పరు­గు­లు, 2 వి­కె­ట్లు), దీ­ప్తి శర్మ (58 పరు­గు­లు, 5 వి­కె­ట్లు) బ్యా­టిం­గ్‌, బౌ­లిం­గ్‌­లో­నూ అద­ర­గొ­ట్టి భారత కీ­ర్తి­ప­తా­కా­న్ని రె­ప­రె­ప­లా­డిం­చా­రు. నవీ ముం­బై­లో­ని డీవై పా­టి­ల్ స్టే­డి­యం వే­ది­క­గా జరి­గిన వర­ల్డ్ కప్ ఫై­న­ల్‌­లో సౌ­తా­ఫ్రి­కా­పై అద్భు­త­మైన వి­జ­యం సా­ధిం­చిం­ది. షె­ఫా­లీ వర్మ, దీ­ప్తి శర్మ అసా­ధా­రణ ప్ర­ద­ర్శ­న­తో అద­ర­గొ­ట్టిన వేళ.. సౌ­తా­ఫ్రి­కా­కు ఓటమి తప్ప మరో మా­ర్గం లే­కుం­డా చే­శా­రు. టాస్ ఓడి ముం­దు­గా బ్యా­టిం­గ్‌­కు ది­గిన భారత జట్టు­కు స్మృ­తి మం­ధాన (45), షె­పా­లీ వర్మ (87) అది­రే ఆరం­భం అం­దిం­చా­రు. అయి­తే ఆ తర్వాత వచ్చిన జె­మీ­మా (24), హర్మ­న్‌­ప్రీ­త్ (20), అమ­న్‌­జో­త్ (12) పె­ద్ద­గా రా­ణిం­చ­లే­దు. అయి­తే దీ­ప్తి శర్మ (58), రిచా ఘోష్ (34) రా­ణిం­చ­డం­తో ని­ర్ణీత 50 ఓవ­ర్ల­లో భా­ర­త్ 298/7 పరు­గుల భారీ స్కో­రు చే­సిం­ది. అయి­తే బల­మైన సౌ­తా­ఫ్రి­కా ముం­దు ఈ స్కో­రు సరి­పో­తుం­దా? అని అంతా అను­మా­నిం­చా­రు. అసలే దక్షి­ణా­ఫ్రి­కా కె­ప్టె­న్ లారా అద్భుత ఫా­మ్‌­లో ఉంది. సె­మీ­ఫై­న­ల్లో భారీ శత­కం­తో ప్రొ­టీ­స్ జట్టు­ను ఫై­న­ల్ చే­ర్చిం­ది. దీం­తో టీ­మిం­డి­యా ఈ స్కో­రు­ను కా­పా­డు­కో­గ­ల­దా అని­పిం­చిం­ది. కానీ భారత బౌ­ల­ర్లు అద్భు­త­మే చే­శా­రు.

కట్టుదిట్టమైన బౌలింగ్..

భారీ ఛే­జ్‌­లో భారత బౌ­ల­ర్లు చాలా కట్టు­ది­ట్టం­గా బౌ­లిం­గ్ చే­శా­రు. తొలి పవ­ర్‌­ప్లే­లో సౌ­తా­ఫ్రి­కా బ్యా­ట­ర్లు భారీ షా­ట్లు ఆడ­కుం­డా అడ్డు­కు­న్నా­రు. ఈ క్ర­మం­లో­నే సఫా­రీ కె­ప్టె­న్ లారా వో­ల్వా­ర్ట్ (101) సెం­చ­రీ­తో ఆక­ట్టు­కు­న్నా.. బ్రి­ట్స్ (23), బాష్ (0), సూన్ లూస్ (25) ఎక్కువ సేపు క్రీ­జు­లో ని­ల­వ­లే­దు. వో­ల్వా­ర్ట్ రా­ణిం­చి­నా ఆమె­కు సహ­కా­రం కరు­వైం­ది. డె­ర్క్‌­స­న్ (35) కొంత పో­రా­డి­నా దీ­ప్తి శర్మ అద్భు­త­మైన డె­లి­వ­రీ­తో ఆమె­ను క్లీ­న్‌­బౌ­ల్డ్ చే­సిం­ది. ఈ క్ర­మం­లో క్రీ­జు­లో­కి వచ్చిన వా­రం­ద­రూ ఒత్తి­డి­కి తలొ­గ్గా­రు. మా­రి­జా­న్ కాప్ (4), సి­నా­లో జఫ్తా (16), క్లో ట్ర­యా­న్ (9), ఖాఖా (1) అం­ద­రూ వి­ఫ­ల­మ­య్యా­రు. చి­వ­ర్లో డి క్ల­ర్క్ (18)ను అవు­ట్ చే­సిన దీ­ప్తి.. సఫా­రీల కథ ము­గిం­చిం­ది. వన్డే వర­ల్డ్ కప్‌­లో భా­ర­త్ ఆడిన తొలి మ్యా­చు­లో ఆల్‌­రౌం­డ్ ప్ర­ద­ర్శ­న­తో చె­ల­రే­గి, ఒం­టి­చే­త్తో జట్టు­ను గె­లి­పిం­చిన దీ­ప్తి శర్మ మరో­సా­రి అలాం­టి ప్ర­ద­ర్శ­నే చే­సిం­ది. వర­ల్డ్ కప్ ఫై­న­ల్ వంటి కీ­ల­క­మైన మ్యా­చు­లో జట్టు కష్టా­ల్లో ఉన్న­ప్పు­డు హాఫ్ సెం­చ­రీ­తో మె­ర­వ­డం­తో­పా­టు.. ఏకం­గా ఐదు వి­కె­ట్లు తీసి ప్ర­త్య­ర్థి వె­న్ను వి­రి­చిం­ది. సెం­చ­రీ­తో చె­ల­రే­గిన లారా వో­ల్వా­ర్ట్, ప్ర­మా­ద­క­ర­మైన కాప్, జఫ్తా, డె­ర్క్‌­స­న్, డి­క్ల­ర్క్ అం­ద­ర్నీ అవు­ట్ చే­సి జట్టు వి­జ­యం­లో కీ­ల­క­పా­త్ర పో­షిం­చిం­ది. ఆమె­కే ‘ప్లే­య­ర్ ఆఫ్ ది టో­ర్న­మెం­ట్’ అవా­ర్డు దక్కిం­ది.


Tags

Next Story