8 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అశ్వత్ కౌశిక్.. ఎవరీ చిచ్చర పిడుగు

బర్గ్‌డోర్ఫర్ స్టాడ్‌థౌస్‌లో పోలిష్ చెస్ గ్రాండ్‌మాస్టర్ జాసెక్ స్టోపాను ఓడించడం ద్వారా, అతను భారతీయ సంతతికి చెందిన చిన్న పిల్లవాడు కూడా చరిత్ర సృష్టించగలడని నిరూపించాడు. క్లాసికల్ వెర్షన్ చెస్‌లో గ్రాండ్ మాస్టర్‌ను ఓడించిన అతి పిన్న వయస్కుడిగా అశ్వత్ నిలిచాడు. చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో తన పేరును నమోదు చేసుకున్న అశ్వత్ కౌశిక్ ఎవరో తెలుసుకుందాం..
ఇంతకు ముందు ఈ రికార్డు లియోనిడ్ పేరిట ఉండేది
అశ్వత్ కౌశిక్ కంటే ముందు, గ్రాండ్ మాస్టర్‌ను ఓడించిన సెర్బియాకు చెందిన లియోనిడ్ ఇవనోవిచ్ అతి పిన్న వయస్కుడని తెలిసిందే. లియోనిడ్ అశ్వత్ కంటే చాలా పెద్దవాడు. బెల్‌గ్రేడ్ ఓపెన్‌లో 60 ఏళ్ల బల్గేరియన్ గ్రాండ్‌మాస్టర్ మిల్కో పాప్చెవ్‌ను ఓడించి లియోనిడ్ ఈ చారిత్రాత్మక ఫీట్ చేశాడు. కానీ ఈ రికార్డు ఎక్కువ కాలం లియోనిడ్ పేరు మీద ఉండలేదు. ఇప్పుడు ఆ ప్లేస్ ను అశ్వత్ తీసుకున్నాడు.
2022లో కూడా పెద్ద ఫీట్ సాధించాడు
అశ్వత్ కౌశిక్ భారతదేశంలో జన్మించాడు. భారతదేశంలో కేవలం 2 సంవత్సరాలు మాత్రమే గడిపిన తరువాత, అతను సింగపూర్‌కు వెళ్లి, అక్కడి నుండి చదరంగం ఆటలో మరికొన్ని మెళకువలు నేర్చుకుని కొత్త శిఖరాలకు చేరుకున్నాడు. కౌశిక్‌కి ఇది మొదటి విజయం కాదు, దీనికి ముందు కూడా అతను 2022 సంవత్సరంలో ఈస్టర్న్ ఏషియన్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-8 విభాగంలో ట్రిపుల్ గోల్డ్ మెడల్ సాధించి వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో కౌశిక్ వయస్సు కేవలం 6 సంవత్సరాలు. ఇప్పుడు అతను ఓడించిన గ్రాండ్‌మాస్టర్ వయస్సు 37 సంవత్సరాలు. చదరంగం ప్రపంచంలో అనుభవజ్ఞుడైన ఆటగాడు, అయినప్పటికీ అతను కౌశిక్ ముందు నిలబడలేకపోయాడు.
'7 గంటల పాటు చదరంగం ఆడిన కౌశిక్'
కౌశిక్ ప్రస్తుతం FIDE ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 37,338 ర్యాంక్‌లో ఉన్నాడు. ఈ విజయం తర్వాత కౌశిక్ మాట్లాడుతూ.. నా ఆట తీరు పట్ల గర్వంగా ఫీలయ్యాను. గేమ్ సమయంలో నేను చాలా ఒత్తిడిని ఎదుర్కున్నాను. నేను ఇక్కడ నుండి బయటపడలేనని భావించాను. కానీ ఆ తర్వాత నేను తిరిగి పుంజుకోగలిగాను, దాని కారణంగా నేను ఈ విజయాన్ని పొందగలిగాను అని చెప్పాడు. కౌశిక్ తండ్రి శ్రీరామ్ మాట్లాడుతూ.. తన కొడుకు చాలా కష్టపడే వాడని అన్నారు. ప్రతిరోజూ సుమారు 7 గంటల పాటు చెస్ ప్రాక్టీస్ చేస్తాడు. చెస్‌లో వేలాది పజిల్స్‌ను పరిష్కరిస్తాడు అని చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com