Cricket : మూడో టెస్టుకు యువ పేసర్‌

Cricket : మూడో టెస్టుకు యువ పేసర్‌
X

భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నవంబర్ 1 నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదిక. తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన భారత జట్టు.. మూడో టెస్టులో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ బ్యాటర్లను ఇబ్బందిపెట్టడానికి కొత్త కుర్రాడిని రంగంంలోకి దింపనుందని సమాచారం. యువ పేసర్ హర్షిత్ రాణా ఈ మ్యాచ్‌తో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కివీస్‌తో సిరీస్‌కు హర్షిత్ ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎంపికయ్యాడు. అయితే, రంజీ ట్రోఫీలో అస్సాంతో మ్యాచ్‌ కోసం జట్టు నుంచి రిలీజ్‌ అయ్యాడు ఈ యువ ఆటగాడు దిల్లీ తరఫున అస్సాంపై ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకం సాధించాడు. దీంతో న్యూజిలాండ్‌తో మూడో టెస్టు కోసం హర్షిత్‌ను భారత జట్టులో భాగం చేశారు. ఆకాశ్‌దీప్‌ను పక్కనపెట్టి హర్షిత్‌ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్‌ ఉంది.

Tags

Next Story