Younis Khan : బాబర్.. కోహ్లీని చూసి నేర్చుకో : యూనిస్ ఖాన్

గత వన్డే, టీ20 ప్రపంచ కప్ లలో పాకిస్థాన్ జట్టు ఘోరంగా విఫలమవ్వడంతో కెప్టెన్ బాబర్ అజామ్ పై అభిమానులు, మాజీ క్రికెట్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక, సొంతగడ్డపై ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టెస్టు సిరీస్ ను కోల్పోవడంతో పాక్ పై విరుచుకుపడుతున్నారు.ఇప్పటికే టెస్టు కెప్టెన్సీని కోల్పోయిన అతడిని.. పరిమిత ఓవర్ల క్రికెట్ సారథ్య బాధ్యతల నుంచీ తప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ స్పందిస్తూ.. బాబర్ అజామ్‌కుకీలక సూచనలు చేశాడు. ‘‘బాబర్ పై భారీ అంచనాలు ఉంటాయి. సోషల్ మీడియాలో అభిమానులు చాలా పోస్టులు పెడుతుంటారు. వాటన్నింటికీ బ్యాట్‌తోనే ఆటగాళ్లు సమాధానం ఇవ్వాలి. అందుకే, ప్లేయర్లు చాలా తెలివిగా సామాజిక మాధ్యమాలను వినియోగించాలి. ముందు అతడు ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలి. ఎల్లవేళలా అవకాశాలు వస్తూనే ఉండవు. తక్కువ వయసులోనే చాలా సాధించాడు. భవిష్యత్తులో ఏం చేయాలనేదానిపై ఓ స్పష్టతతో ఉండాలి. కెప్టెన్సీ చాలా చిన్న విషయం. ఆటగాడిగా నాణ్యమైన ప్రదర్శనే ముఖ్యం. విరాట్ కోహ్లీనే తీసుకుంటే.. సారథ్యం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాడు. నాటి నుంచి భారీగా పరుగులు చేస్తూ రికార్డులను తన పేరిట నమోదు చేస్తున్నాడు. దేశం కోసం ఆడటమే అత్యంత ముఖ్యం. ఆ తర్వాతే ఏదైనా ఉంటే అప్పుడు వ్యక్తిగత కీర్తి కోసం ప్రయత్నించాలి’’ అని యూనిస్ పేర్కొన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com