క్రీడలు

Yuvraj Singh : తండ్రైన యువరాజ్ సింగ్.. !

Yuvaraj Singh : ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రయ్యాడు. తన భార్య హజెల్ కీచ్ మగబిడ్డకకు జన్మనిచ్చింది.

Yuvraj Singh : తండ్రైన యువరాజ్ సింగ్.. !
X

Yuvaraj Singh : ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రయ్యాడు. తన భార్య హజెల్ కీచ్ మగబిడ్డకకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకే రకమైన పోస్ట్‌తో వెల్లడించాడు. " అభిమానులు, స్నేహితులందరికీ, ఈ రోజు దేవుడు మాకు మగబిడ్డను ప్రసాదించాడనే విషయాన్ని పంచుకోవడానికి సంతోషిస్తున్నాము. దేవుని ఆశీర్వాదానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము" అని వెల్లడించారు. దీనితో పలువురు క్రికెటర్లతో పాటుగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు.

కాగా 2011లో యువరాజ్ సింగ్, హజెల్ కీచ్ ఇద్దరికీ ఓ పార్టీలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. పెళ్ళికి దారి తీసింది. వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన 2011 సూపర్ హిట్ చిత్రం 'బాడీగార్డ్'లో కరీనా కపూర్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్ పాత్రలో హాజెల్ నటించింది. అంతేకాకుండా పాపులర్ రియాలిటీ షో బిగ్‌‌బాస్ 7లో కూడా పాల్గొంది. ఇక యువరాజ్ సింగ్ భారత క్రికెట్‌‌లో అల్‌‌రౌండర్‌‌గా తనదైన ముద్రవేశాడు. భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌‌కప్‌‌లో కీరోల్ ప్లే చేశాడు. ఇక జూన్ 10, 2019న అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్‌‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

Next Story

RELATED STORIES