క్రీడలు

హ్యాట్సాఫ్ యువరాజ్‌.. యువికేఎన్ ఫౌండేషన్ ద్వారా నిజామాబాద్ ప్రభుత్వాసుత్రిలో ఐసీయూ ఏర్పాటు..!

తమ యువికెన్ ఫౌండేషన్ ద్వారా నిజమాబాద్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూను ఏర్పాటు చేశారు.

హ్యాట్సాఫ్ యువరాజ్‌.. యువికేఎన్ ఫౌండేషన్ ద్వారా నిజామాబాద్ ప్రభుత్వాసుత్రిలో ఐసీయూ ఏర్పాటు..!
X

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్.. మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తమ యువికెన్ ఫౌండేషన్ ద్వారా నిజమాబాద్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూను ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 120 పడకల క్రిటికల్ కేర్ విభాగాన్ని యువరాజ్ సింగ్.. వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యాక్రమంలో యువీ తల్లి షబ్నమ్ సింగ్, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. కరోనా మహమ్మారి చాలా మంది జీవితాల్లో చీకట్లు నింపిందని యువరాజ్‌ సింగ్ అన్నారు. ఎంతో మంది ఆస్పతుల్లో బెడ్స్ లేక ఇబ్బంది పడ్డారని చెప్పారు. వెంటిలెటర్ బెడ్స్ దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పేదవారికి అలాంటి ఇబ్బందులు మళ్లీ థర్డ్‌వేవ్‌లో రాకూడదనే యువికేఎన్ ఫౌండేషన్ మిషన్ వెయ్యి బెడ్స్ ప్రాజెక్ట్ చేపట్టామన్నారు. కరోనా బాధితులకు యువీ ఫౌండేషన్ అండగా ఉంటుందని యువరాజ్ సింగ్ తెలిపారు.

యువరాజ్ సింగ్ సేవా నిరతిని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. పేదల కోసం యూవికెన్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను తెలంగాణ ప్రభుత్వం తరుపున ధన్యవాదాలు తెలిపారు. కాగా.. జిల్లా ఆస్పత్రిలో రెండు ఫ్లోర్‌లలో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ ప్రత్యేక విభాగాలను కలెక్టర్, మేయర్ సంయక్తంగా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి దేశస్థాయిలో గుర్తింపు పొందింది. కరోనా సమయంలో కొవిడ్ రోగులకు వైద్య సిబ్బంది చేసిన సేవలను యువరాజ్ సింగ్ గుర్తించారు. ఎమ్మెల్సీ కవిత చొరవతో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా తన ఫౌండేషన్ తరపున 2.5 కోట్ల విలువ చేసే 120 ఐసీయూ బెడ్స్ అందజేశారు యువరాజ్ సింగ్.

Next Story

RELATED STORIES