Atlassian Bengaluru 2025 : జెన్-జీ స్టైల్ ఏఐ..గందరగోళం నుంచి స్మార్ట్ సిస్టమ్ వైపు..ఆఫీస్ పనిలో సరికొత్త విప్లవం.

Atlassian Bengaluru 2025 : జెన్-జీ స్టైల్ ఏఐ..గందరగోళం నుంచి స్మార్ట్ సిస్టమ్ వైపు..ఆఫీస్ పనిలో సరికొత్త విప్లవం.
X

Atlassian Bengaluru 2025 : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పటివరకు మనకు కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే తెలుసు. కానీ, ఇప్పుడు అది మన ఆఫీసుల్లో మన పక్కన కూర్చుని పని చేసే ఒక టీమ్ మేట్‎లా మారిపోతోంది. బెంగళూరు వేదికగా జరిగిన అట్లాసియన్ టీమ్ ఆన్ టూర్ 2025 ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇకపై ఏఐ అనేది కేవలం సాఫ్ట్‌వేర్ కాదు, అది మన పనిని సులభతరం చేసే ఒక నమ్మకమైన భాగస్వామి. చెల్లాచెదురుగా ఉన్న సమాచారాన్ని ఒక్కచోటికి చేర్చి, స్మార్ట్ సిస్టమ్‌గా మార్చడమే దీని అసలు మ్యాజిక్.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన పని తీరును మార్చేస్తుందని మనం ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ అది ఎలా సాధ్యం? అనే ప్రశ్నకు సమాధానంగా బెంగళూరులో జరిగిన అట్లాసియన్ సదస్సు నిలిచింది. కంపెనీల్లో సమాచారం అంతా ఒకే చోట ఉండదు. కొంత జిరాలో ఉంటే, మరికొంత కాన్ఫ్లూయెన్స్‎లో ఉంటుంది. ఇలా చెల్లాచెదురుగా ఉన్న డేటా వల్ల ప్రొడక్టివిటీ దెబ్బతింటోంది. దీనికి పరిష్కారమే సిస్టమ్ ఆఫ్ వర్క్. ఈ కొత్త విధానంలో ఏఐ ఒక సెర్చ్ ఇంజిన్‌లా కాకుండా, మన అవసరాలను అర్థం చేసుకుని పని చేసే ఒక తెలివైన అసిస్టెంట్‌లా మారుతుంది.

ఈ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది అట్లాసియన్ రోవో. ఇది ఒక ఏఐ లేయర్. ఇది కేవలం మన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు, మనకు కావాల్సినట్టుగా ఏఐ ఏజెంట్లను కూడా సృష్టించుకునే వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు.. ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ తన పనికి తగినట్టుగా ఒక ఏజెంట్‌ను సెట్ చేసుకుంటే, అది ఆటోమేటిక్‌గా కోడింగ్‌లో తప్పులను వెతకడం, డాక్యుమెంటేషన్ చేయడం వంటి పనులు చేస్తుంది. రోవో స్టూడియో వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారు స్వయంగా తమ ఏఐ ఏజెంట్లను తయారు చేసుకుని చూశారు. ఇది ఎంత సింపుల్ అంటే.. కోడింగ్ తెలియని వారు కూడా చాలా సులభంగా తమకు నచ్చిన ఏఐ అసిస్టెంట్‌ను బిల్డ్ చేసుకోవచ్చు.

పెద్ద పెద్ద సంస్థల్లో ఏఐని వాడేటప్పుడు భద్రత అనేది అతి ముఖ్యమైన విషయం. అట్లాసియన్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ దీనికి సరైన పరిష్కారాన్ని చూపుతోంది. ఎవరికి ఎంత వరకు సమాచారం కనిపించాలి? ఏఐ ఏ డేటాను వాడుకోవాలి? వంటి అంశాలపై పూర్తి నియంత్రణ ఉంటుంది. గత ఏడాది ఏఐ అంటే ఏమిటి? అనే కుతూహలం అందరిలో ఉండేది. కానీ 2025 నాటికి పరిస్థితి మారింది. ఇప్పుడు అందరూ ఏఐని ఎంత త్వరగా మన పనిలో భాగం చేసుకోవాలి? అని ఆలోచిస్తున్నారు. అంటే ఏఐ అనేది ఇకపై మనకు ఒక ఆప్షన్ కాదు, అది ఒక అవసరం.

Tags

Next Story