మనిషి చర్మంపై కరోనా వైరస్ ఎంతసేపు ఉంటుందో తెలుసా..!!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రాణాంతకర అంటువ్యాధి. ఈ కరోనా మహమ్మారి మానవ శరీరం మీద ఎంత సేపు ఉంటుంది? కరోనా వైరస్ గాలి ద్వార వ్యాపిస్తుందా? అసలు గాలిలో ఎంత దూరం వరకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది? కరోనా కట్టడికి మాస్కు ధరిస్తే.. శ్వాస, ఊపిరితిత్తులకు ఎఫెక్ట్ అవుతుందా? ఇలాంటి ప్రశ్నలకు జపాన్‌కు చెందిన క్యోటో వర్శిటీ పరిశోధకులు సమధానాలు చెబుతున్నారు.
ప్రాణాంతకర కరోనా వైరస్ మనిషి శరీరంపై ఫ్లూ వైరస్ కన్నా ఎక్కువ సమయం నిలిచి ఉంటుందని క్యోటో వర్శిటీ పరిశోధకులు తెలిపారు. సుమారు 9గంటలకు పైగా చర్మంపై నిలిచి ఉండే అవకాశం ఉందంటున్నారు. దీంతో వైరస్ సులువుగా ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ మహమ్మారి వ్యాప్తిని నివారించాలంటే చేతులను శుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు. ఇథనాల్ ద్రావణాన్ని ఉపయోగిస్తే ఈ వైరస్‌లను 15 సెకన్లలో మనిషి శరీరం నుంచి నిర్మూలించవచ్చు అని పేర్కొన్నారు.
మరోవైపు కరోనా వైరస్ గాలిలో ఆరు అడుగుల దూరం వరకు వ్యాప్తి చెందుతుందని 'సీడీసీ' తెలిపింది. కానీ కొందరు నిపుణులు సీడీసీ సూచించిన మార్గదర్శకాలను తప్పుబట్టారు. కరోనా వైరస్ బహిరంగ ప్రదేశాల్లో వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలని వారు సూచించారు. మాస్కు పెట్టుకోవడం ద్వారా శ్వాస, ఊపిరితిత్తులకు ఎలాంటి సమస్య ఉండదని పరిశోధకులు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com