కరోనా ఉందో లేదో ఒక్క నిమిషం లోపే చెప్పేస్తుంది..!!

కరోనా ఉందో లేదో ఒక్క నిమిషం లోపే చెప్పేస్తుంది..!!
వలం 30 నుంచి 50 సెకన్లలోనే కరోనా రిజల్ట్

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 69 లక్షలు దాటాయి. ప్రస్తుతం ఇండియాలో రోజూ 11 లక్షలకు పైగా కరోనా టెస్టులు జరుగుతున్నాయి. కరోనా వైరస్‌ను ర్యాపిడ్‌ టెస్టుల ద్వారా కొన్ని నిమిషాల వ్యవధిలోనే గుర్తించగలుగుతున్నారు. అయితే వైరస్‌ను నిమిషంలోపే నిర్ధారించే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌-ఇజ్రాయిల్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేశారు. ఈ నూతన విధానం ప్రయోగాల్లో తుది దశకు చేరుకుంది. ఈ ర్యాపిడ్‌ టెస్ట్‌ విధానం మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానుందని ఇజ్రాయిల్‌ విదేశాంగశాఖ ప్రకటించింది.

'ఓపెన్ స్కై' పేరుతో పిలిచే ఈ పరిజ్ఞానం ద్వారా ఎయిర్‌పోర్టులు, ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ట్యూబ్‌లో వ్యక్తి ఊదాల్సి ఉంటుంది. తద్వారా కేవలం 30 నుంచి 50 సెకన్లలోనే కరోనా రిజల్ట్ వస్తుంది. అత్యంత వేగంగా వైరస్‌ను గుర్తించగలిగే ఈ విధానం అందుబాటులోకి రావడం గుడ్‌న్యూస్ అని ఇజ్రాయిల్‌ రాయబారి రాన్‌ మాల్కా అభిప్రాయపడ్డారు. ఈ నూతన విధానం కొవిడ్ టెస్టుల్లోనే గేమ్‌ ఛేంజర్‌గా మారే అవకాశం ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story