జనన మరణాలు నిర్ణయించేది జాతకాలా.. దేవుడు కాదా?

జనన మరణాలు నిర్ణయించేది జాతకాలా.. దేవుడు కాదా?
నిజంగా ఉన్నాడో లేడో తెలియని దేవుడిని ఆరాధిస్తాము. తప్పు చేస్తే భయపడతాము. ఆ భయంతోనే కొంత బాధ్యతతో మెలగడానికి ప్రయత్నిస్తుంటాము.

మంచంలో ఉన్న మనిషికి మరణం సంభవిస్తే.. ఉండి బాధలు పడే కంటే దేవుడు తీసుకెళ్లి మంచి పని చేశాడు అని అంటారు. అదే అర్థాంతరంగా మరణిస్తే దేవుడు ఎంత నిర్ధయుడు. అన్యాయంగా ఓ మంచి మనిషిని తీసుకెళ్లాడు అంటూ నిందిస్తాము. ఇలా అనుకోవడం మానవ సహజం. అన్నింటికీ దేవుడినే నిందిస్తాము. నిజంగా ఉన్నాడో లేడో తెలియని దేవుడిని ఆరాధిస్తాము. తప్పు చేస్తే భయపడతాము. ఆ భయంతోనే కొంత బాధ్యతతో మెలగడానికి ప్రయత్నిస్తుంటాము. మరి జాతకాల మాటేమిటి. మనుషులే రాసిన ఈ జాతకాలపై నమ్మకాలేంటి. దేవుడు మన జాతకం పుట్టినప్పుడే రాశాడని అంటారు కదా. అది ఎంతవరకు నిజం...

దుబాయ్‌లోని ఓ స్టార్ హోటల్‌లో అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి మరణించిన విషయం తెలిసిందే. 54 ఏళ్ల శ్రీదేవి జీవితం ముగిసి పోయింది. కానీ ఆమె జాతకం ప్రకారం 70 ఏళ్ల ఆయుష్షు ఉందని, అయితే ఆమె మరణాన్ని కొని తెచ్చుకున్నారని కర్ణాటకలోని ఉడిపికి చెందిన ప్రముఖ జ్యోతీష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య అంటున్నారు. 1963 ఆగస్టు 13వ తేదీన పుట్టిన శ్రీదేవి జాతకం ప్రకారం గ్రహాలు అన్నీ ఆమెకు అనుకూలంగానే ఉన్నాయని అంటున్నారు. అయితే 70 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉండే అవకాశం లేదని, అనారోగ్యంతో మంచంలో ఉండి సేవలు చేయించుకోవాల్సి వచ్చేదని అంటున్నారు. మరో విషయాన్ని ప్రస్తావిస్తూ మృత్యువు మనుషుల్ని ముందే హెచ్చరిస్తుందని అంటున్నారు. నిద్రపోతున్న సమయంలో ఎవరో ఎత్తుకు పోతున్నట్లు కలలు రావడాన్ని ముందస్తు హెచ్చరికల్లో ఒకటిగా చెబుతున్నారు.

శ్రీదేవి విషయంలో మృత్యువు ఆమెను వెంటాడలేదని, ఆమే మరణాన్ని కొని తెచ్చుకున్నారని అమ్మణ్ణయ్య అంటున్నారు. తన జాతకం ప్రకారం మరణించే ముందు సన్నిహితుల వద్ద మరణం విషయం ప్రస్తావించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని ఆయన అంటున్నారు. చివరిగా మనిషి ఆయుష్షుని వస్తువుతో పోల్చాడు. జాగ్రత్తగా ఉంచుకుంటే ఏ వస్తువు అయినా ఎక్కువ కాలం మన్నుతుందని, అలాగే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆయుష్షు ఉన్నంతకాలం బతుకుతామని ముగింపు ఇచ్చారు జ్యోతీష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య.

Tags

Read MoreRead Less
Next Story