PSLV-C59 Rocket : పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ కు కౌంట్ డౌన్ పీక్స్

శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్‌ను సాయంత్రం నింగిలోకి పంపనుంది. ఈ రాకెట్ ప్రయోగం సాయంత్రం 4:08 గంటలకు జరుగనుంది. ఈ ప్రయోగం ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 శాటిలైట్‌తో పాటు మరో నాలుగు ఉపగ్రహాలను నింగిలో ప్రవేశపెట్టనున్నారు. ప్రోబా-3 శాటిలైట్ ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. తద్వారా సూర్యకిరణాల అధ్యయనానికి, అంతరిక్ష శాస్త్ర పరిశోధనలకు ముఖ్యంగా ఉపయోగపడనుంది. ఇది భూమి నుంచి దాదాపు 60,000 కి.మీ ఎత్తున తన కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఇది సూర్యుని సంబంధిత విశేషాలపై కొత్త సమాచారాన్ని అందించగలదు. ఈ ప్రయోగంలో మరో నాలుగు ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహాలు వ్యవసాయం, వాతావరణం, కమ్యూనికేషన్ వంటి రంగాలకు ఉపయోగపడే విధంగా రూపొందించారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకునే అవకాశముంది.
మరోవైపు తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో ఇస్రో బృందం పాల్గొంది. ప్రయోగం విజయవంతం కావడానికి ఆలయంలో పూజలు చేశారు. రాకెట్ ప్రయోగం ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com