అప్పుడు జగన్..ఇప్పుడు షర్మిల.. మానుకోటలో అరెస్టుల పర్వం

మానుకోట రాళ్ల ఘటన తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించింది. వైయస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకోసం రైలులో బయలుదేరి మానుకోట వస్తుండగా.. ఒక్క సారిగా తెలంగాణ ఉధ్యమకారుల నుంచి నిరసనసెగ తగిలింది. ఉవ్వేత్తున ఉద్యమం నడుస్తున్న సమయంలో పార్లమెంట్ లో జగన్ సమైక్యాంద్ర ప్లే కార్డు పట్టుకోవడం తెలంగాణ వాదుల ఆగ్రహానికి కారణమైంది.
ఓదార్పు యాత్రను అడ్డుకుంటామని ప్రకటించినప్పటికి జగన్ యాత్రకు బయలుదేరారు. తెలంగాణవాదులంతా మహాబూబూబాద్ రైల్వేస్టేషన్ లో జగన్ ను అడ్డుకునేందుకు సిద్దమయ్యారు. ఒక్కసారిగా రాళ్ల దాడి మొదలైంది. అటు పోలీసులు కాల్పులు ఇటు రాళ్లదాడి మధ్య మానుకోట దద్దరిల్లింది. జగన్ గోబ్యాక్ నినాదాలు ..రాళ్ల దాడి తో మానుకోట రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది. చివరకు జగన్ ను వంగపల్లి స్టేషన్ లో అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు.
మే 2010 లో మానుకోట ఘటన జరగింది. దాదాపు పదమూడేళ్ల తర్వాత మరోసారి మానుకోట వార్తల్లో నిలిచింది. ఈసారి జగన్ సోదరి షర్మిల మానుకోటలో పాదయాత్ర సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. షర్మిల వాఖ్యలను ఖండిస్తూ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. షర్మిల బసచేస్తున్న చోట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పాదయాత్రను అడ్డుకొని దాడికి ప్రయత్నం చేశారు. అటు పాదయాత్ర అనుమతి రద్దుచేసిన పోలీసులు షర్మీలను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు.
నర్సంపేటలో ఇదే తరహా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై షర్మిల చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీశాయి, అప్పుడు పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవడంతో..తిరిగి పాదయాత్ర ప్రారంభించిన షర్మిల మానుకోటలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి..
శంకర్ నాయక్ ప్రతిపక్ష నేతలను కొజ్జాలుగా అభివర్ణించారని ఆరోపిస్తూ.. షర్మిలా వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్తితులు మరోసారి తలెత్తడంతో .. పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. ఇరవై తేదినుంచి ఖమ్మం జిల్లా పాలేరులో పాదయాత్ర నిర్వహించాల్సి ఉంది. మార్చి ఐదున పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో నిర్వహించే సభతో పాదయాత్ర ముగియనుంది. 2021 ఆక్టోబర్ 20న ప్రారంభం అయిన ప్రజాప్రస్తానం పాదయాత్ర 4111కీలోమీటర్ల మైలురాయి వద్ద ముగించనుంది.. అయితే మానుకోట ఘటన నేపద్యంలో పాదయాత్రకు తిరిగి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సో పోలీసులు అనుమతి ఇస్తారా.. లేక మరోసారి కోర్టును ఆశ్రయించాల్సివస్తోందో అనేది వేచి చూడాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com