Yuvagalam : లోకేష్ పాదయాత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కారం

నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కారం కాబోతుంది. ఇవాళ పాదయాత్ర వేయి కిలో మీటర్ల మార్క్‌ను దాటబోతుంది. ఉద్యమంలా ప్రారంభమైన.. ఉప్పెనలా మారి ఇప్పుడు ప్రభంజనం అవుతోంది. అన్నింటికీ సమాధానం పాదయాత్రతోనే ఇస్తున్నారు లోకేష్. విశ్రాంతి లేకుండా నడుస్తున్నానని అలసటకు గురి కావడం లేదు. రోజంతా బిజీగానే ఉంటున్నారు. నాలుగైదు గంటలు మాత్రమే నిద్ర. మిగతా సమయం అంతా ప్రజల్లోనే. ప్రతీ చోటా ప్రజలకు లోకేష్ ఇస్తున్న భరోసాతో ప్రజల్లో నమ్మకం కలుగుతోంది.అన్ని వర్గాల వారినీ కలుస్తున్నారు. మద్దతు ఇస్తున్నారు.సాయం కోసం వచ్చిన వారిని నిరాశపర్చడం లేదు.
లోకేష్ తనపై ఉన్న అంచనాలను తలకిందులు చేస్తూ తానేంటో నిరూపించుకుంటున్నారు. ఇప్పటికే అద్భుతం సృష్టించారు.. మరో మూడు వేల కిలోమీటర్లు పూర్తయ్యే సరికి ఆయన ఇమేజ్ మాస్ లీడర్ గా పూర్తిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవాళ 77వ రోజు పాదయాత్రలో లోకేష్‌తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు.. అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు.యువనేతను చూసేందుకు భారీగా తరలివచ్చారు. సాయంత్రం యువగళం పాదయాత్ర సిరిగుప్ప క్రాస్ దగ్గర 1000 కిలోమీటర్ల మార్క్‌ను దాటనుంది ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు లోకేష్.ఇక లోకేష్ పాదయాత్రలో ఊహించని రీతిలో జన ప్రవాహం కనిపించింది..దారిపొడవునా జనం బారులు తీరారు.. లోకేష్‌ను చూసేందుకు, ఆయనతో తమ సమస్యలు చెప్పుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
ఆదోని బైపాస్ క్రాస్ వద్ద స్థానికులతో సమస్యలపై లోకేష్ చర్చించనున్నారు. ఆ తరువాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ జేఏసీతో మాటామంతీ నిర్వహించనున్నారు. అలాగే స్థానిక దర్గా దగ్గర ఎస్సీ సామాజిక వర్గీయులతో భేటీ అయి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. సాయంత్రం కడి కొత్త క్రాస్ దగ్గర బహిరంగ సభ లో పాల్గొని ప్రసంగించనున్నారు లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com