మంచిర్యాల యువకుడి హత్య కేసులో... మరో కోణం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి చెందిన యువకుడి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి అయిన తర్వాత కూడా యువతి మహేష్‌కు వీడియో కాల్స్ చేసింది. ఆ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. మహేష్‌కు వీడియో కాల్ చేసిన యువతి.. తన భర్త ఎలా వేధిస్తున్నాడో చెబుతూ బాధను పంచుకుంది. మహేష్ మర్డర్‌కు ముందు ఈ వీడియో కాల్ చేసినట్లు చెబుతున్నారు.
ఇందారం గ్రామానికి చెందిన యువతితో అదే గ్రామానికి చెందిన మహేష్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. అది నచ్చని కుటుంబ సభ్యులు.. ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. కోపంతో రగిలిపోయిన మహేష్.. యువతితో తాను కలిసిన తిరిగిన ఫోటోలు, ఇద్దరూ సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలను ఆమె భర్తకు పంపాడు. అంతే కాకుండా కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో యువతి, ఆమె భర్తకు మధ్య విభేదాలు తలెత్తాయి. కొద్ది నెలల క్రితం ఆమె భర్త ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అప్పట్నుంచి ఆ యువతి తల్లిదండ్రుల ఇంటికి వచ్చి ఉంటోంది.
తల్లిదండ్రుల ఇంటికి వచ్చినా ఆ యువతికి మహేష్ వేధింపులు ఆగలేదు. మెసేజ్‌లు, పాత ఫోటోలు, వీడియోలు పంపిస్తూ మహేష్ వేధింపులు పెంచాడు. ఆమె ససేమిరా అంటున్నా.. మహేష్ వెంట పడుతూ వేధిస్తుండడంతో.. కుటుంబ సభ్యులు విసుగు చెందారు. నిన్న మహిళ ఇంటి ముందు నుంచి బైక్‌పై వెళ్తూ హారన్ కొట్టడంతో.. మహేష్‌ను ఆమె కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. కుటుంబ సభ్యులంతా మహేష్‌ను కొట్టి చంపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com