Summer Heat : తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

Summer Heat : తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఎండల తీవ్ర రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏపీలోని పలు జిల్లాలో పగటి పూట ఉష్ణోగ్రతలు 40డిగ్రీలపైనే నమోదు అవుతున్నాయి. ఇక తీర ప్రాంతం అయిన విశాఖ నగరంలో సైతం వేసవి ప్రతాపం తీవ్రంగా ఉంది. ఎండవేడిమి కారణంగా అస్వస్థతకు గురి అయి పలువురు ఆస్పత్రి బాటపడుతున్నారు. ఇక ఎండల తీవ్రత నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దంటున్న డాక్టర్ రామ్ కుమార్‌.

నల్గొండ జిల్లా పరిధిలోని భారీ ప్రాజెక్టు అయినా నాగార్జున సాగర్‌ నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతుంది. వేసవి మొదట్లోనే ప్రాజెక్టులో నీరు అడుగంటిపోతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 523 అడుగులకు పడిపోయింది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి సామర్థ్యం 156 టీఎంసీలుగా ఉంది. గత ఏడాది కంటే 16 అడుగులు మేర నీటిమట్టం తగ్గిపోయింది.

Tags

Next Story