Mini Mahanadu : ఖమ్మంలో టీడీపీ కార్ ర్యాలీ

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో తెలుగుదేశం శ్రేణులు భారీ కార్ ర్యాలీ నిర్వహించాయి. మినీ మహానాడు సందర్భంగా సత్తుపల్లిని పసుపు మయం చేసిన టీడీపీ నేతలు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో కార్లతో ర్యాలీ నిర్వహించారు. కాసేపట్లో సత్తుపల్లిలో టీడీపీ మినీ మహానాడు జరగనుంది. నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది టీడీపీ. మినీ మహానాడు సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేశాయి టీడీపీ శ్రేణులు.ఫ్లెక్సీలు,తోరణాలతో సత్తుపల్లి పసుపు మంయంగా మారింది. ఈ కార్యక్రమానికి టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి దేవినేని ఉమ ముఖ్య అతిధులగా హాజరు కానున్నారు. జిల్లా నలుమూలల నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.టీడీపీ మినీ మహానాడు కార్యక్రమంతో తెలంగాణలో టీడీపీ బలపడుతోందని అంటున్నారు స్థానిక నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com