భారీగా పెరిగిన బీఆరెస్, వైసీపీ ల ఆస్తులు. BRS 512 కోట్లు, YSRCP 343 కోట్లు.

భారీగా పెరిగిన బీఆరెస్, వైసీపీ ల ఆస్తులు. BRS 512 కోట్లు, YSRCP 343 కోట్లు.

తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలైన బీఆరెస్, వెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల ఆస్తులు భారీగా పెరిగాయి. 2021 - 22 ఆర్ధిక సంవత్సరానికి ఆ పార్టీలు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన ఆడిట్ రిపోర్టు ప్రకారం బీఆరెస్ పార్టీ ఆస్తులు 512 కోట్లు గానూ, వైసీపీ ఆదాయం 343 కోట్లు గా వున్నాట్లు ఆ పార్టీలే స్వయంగా ప్రకటించారు. అంతకు క్రితం సంవత్సరం టీఆరెస్ పార్టీ ఆదాయం 319 కోట్లు ఉండగా 2021-22 ఆర్దిక సంవత్సరాని 193 కోట్లు పెరిగి 512కోట్లకు చేరినట్టు తెలుస్తోంది.

దీంతో దేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన ప్రాంతీయ పార్టీల్లో ముందు వరుసలోచేరింది. గులాబీ పార్టీకి 451కోట్ల విలువచేసే స్దిరాస్తులున్నాయి. వాటిలో ఎక్కవ శాతం భూములు, బంగళాలవంటి స్దిరాస్తుల రూపంలోనే వున్నాయి. 2021 సం. రానికి ఆ పార్టీ 218కోట్ల మొత్తాన్ని ఎలక్టోరేట్ బాండ్లరూపంలోనే పొందిందట. ఆ సంవత్సరానికి ఖర్చుచేసిన 28కోట్ల మొత్తంలో అధిక శాతం (18 కోట్లు) కార్యకర్తల భీమా ప్రీమియం చెల్లింపులకోసమే ఖర్చుచేసినట్టు లెక్కల్లో తెలిపింది.

ఇక ఆంద్ర ప్రదేశ్ లో అదికారంలో వున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తులు అంతకు క్రితం సం.లో 256 కోట్లు వుండగా 2021-22 సంనికి అవి 343 కోట్లకు పెరిగాయట. అంటే 77 కోట్ల ఆదాయం పెరిగిందన్నట్టు. ఈ మొత్తంలో సుమారు 180 కోట్ల మొత్తం బ్యాంకు బ్యాలెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లరూపంలో వుందట. 60కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా, 20కోట్ల రూపాయలు ఎన్నికల ట్రస్ట్ ద్వారా సమకూరాయని తెలిపింది. పార్టీకి పెద్దమొత్తంలో డొనేషన్లిచ్చిన వారిలో మెగా ఇంజినీరింగ్ , కేఎంవీ ప్రాజెక్ట్స్, జీఎంఆర్, బారతీ ఎయిర్టెల్ సంస్తలున్నాయి.

ఇక అప్పుల విషయానికొస్తే టీఆరెస్ పార్టీకి 9.6కోట్ల అప్పుండగా, వైఎస్ఆర్ సీపీ పార్టీ అప్పులు కేవలం 7.5 లక్షలు మాత్రమే.

Read MoreRead Less
Next Story