TGSRTC : విజయవాడ-హైదరాబాద్ టికెట్ ధరలో 10 శాతం డిస్కౌంట్.. సజ్జనార్ రిలీఫ్
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ నేపథ్యం లో హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రాజధాని, ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది.
ముందస్తు రిజర్వేషన్ కోసం ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఈ రూట్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణంపై డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ కోరారు.
ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో వరదలు పోటెత్తడంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 36 గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. వరద ఉధృతి స్వల్పంగా తగ్గడంతో మళ్లీ రాకపోకలు మొదలవ్వడంతో విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టికెట్లపై రాయితీని ప్రకటించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com