TG : కొత్త రేషన్ కార్డులకు 10 లక్షల దరఖాస్తులు!

TG : కొత్త రేషన్ కార్డులకు 10 లక్షల దరఖాస్తులు!
X

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవ కేంద్రాల ద్వారా 1.50 లక్షల అప్లికేషన్లు వచ్చాయని సివిల్ సప్లయ్స్ అధికారులు తెలిపారు. GHMC పరిధిలోనే లక్ష దాటాయన్నారు. కులగణన సర్వే, గతంలో వచ్చిన అప్లికేషన్లు అన్నీ కలిపి ఈ సంఖ్య 10 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల మార్పుల కోసం 20 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం. మార్చి 1న లక్ష కొత్త కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కులగణన రీసర్వేకు ప్రభుత్వం అవకాశం కల్పించినా చాలా కుటుంబాలు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండోసారి సర్వేలో 3,56,323 కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 8,422 కుటుంబాలే ఎంట్రీ చేయించుకున్నాయి. రీసర్వేకు ఎల్లుండితో గడువు ముగియనుంది. సర్వేలో పాల్గొనాలనుకునేవారు ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు 040 21111111 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. MPDO ఆఫీసుల్లోనూ వివరాలు ఇవ్వొచ్చు.

Tags

Next Story