Hyderabad : హైదరాబాద్‌లో 1184 డ్రంక్ ఆండ్ డ్రైవ్ కేసులు

Hyderabad : హైదరాబాద్‌లో 1184 డ్రంక్ ఆండ్ డ్రైవ్ కేసులు
X

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత అర్ధరాత్రి 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్‌లో అత్యధికంగా 236, సౌత్ ఈస్ట్ జోన్‌లో 192, వెస్ట్ జోన్‌లో 179, నార్త్ జోన్ 177, సెంట్రల్ జోన్ 102, సౌత్ వెస్ట్ జోన్‌లో 179 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 31, 2024 రాత్రి నుంచి జనవరి 1, 2025 ఉదయం వరకు మొత్తం 619 మందిని రాచకొండ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువగా 20 నుంచి 30 సంవత్సరాల వయసు లోపు ఉన్న యువకులే ఉన్నారు. అరెస్ట్ వారిలో వీరి సంఖ్య 262.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన 619లో ఇద్దరు మైనర్లు ఉండగా.. 50 ఏళ్లు పైబడిన వారు 33 మంది ఉన్నారని రాచకొండ పోలీసులు తెలిపారు. పోలీసుల జారీ చేసిన నివేదిక ప్రకారం.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అరెస్టు అయిన వారిలో 18-20 ఏళ్ల వయస్సు గల వారు.. 12 మంది, 21-30 ఏళ్ల వయస్సు కలవారు 262 మంది, 31-40 ఏళ్ల వయస్సు గల వారు 201 మంది, 41-50 సంవత్సరాల వయస్సు ఉన్నవారు.. 109 మంది, 51-60 ఏళ్ల వయస్సు గల వారు 30 మంది, 61-70 వయసు గల సీనియర్ సిటిజెన్లు ముగ్గురు ఉన్నారు. ఈ జాబితా మహిళలు లేకపోవడం.. అందరూ పురుషులే ఉండడం గమనార్హం. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిన సంగతి తెలిసిందే.

Tags

Next Story