TG : బంజారాహిల్స్ లో కబ్జాకు గురైన... 12 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

TG : బంజారాహిల్స్ లో కబ్జాకు గురైన... 12 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
X

బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారు. ఈ విషయాన్ని స్థానికులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా.. వెంటనే విచారణ జరుపాలని ఆర్టీవో, ఎమ్మార్వోను ఆదేశించారు. సర్వే నంబర్ 102/1 హెచ్ఐకే /1 లో 12 ఎకరాల ప్రభు త్వ భూమిగా నిర్ధారణ కావడంతో.. కలెక్టర్ అనుదీప్ వెంటనే ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, ఆ భూముల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్టీవో, ఎమ్మార్వోలు కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలెక్టర్ అనుదీప్ దురశెట్టి తో కలిసి పరిశీలించారు. 12 ఎకరాల ప్రభుత్వ స్థలం చుట్టూ పెన్సింగ్ వేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ భూమి కాపాడిన కలె క్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోను మంత్రి పొన్నం అభినందించారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే అధికారులకు చెప్పాలన్నారు. ఈ భూమిని ప్రజలకు ఉపయోగపడే విధంగా సీఎం దృష్టికి తీసుకువెళ్లి మంచి నిర్ణయం తీసుకుంటామ న్నారు. ఇదే స్ఫూర్తితో ఇతర అధికారులు పని చేయాలని, ప్రభుత్వస్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags

Next Story