Pet Animals: ప్రేమకు పిల్లులైన..పిల్లలైన మాకు ఒక్కటే

మనలో చాలా మంది పిల్లిని అపశకునంగా భావిస్తుంటాం.ఏదైనా కార్యక్రమానికి లేదా పనిమీద వెళ్తున్నప్పుడు పిల్లి కనిపిస్తే వెంటనే ఆగి కాసేపటి తరువాత మళ్లీ బయలుదేరుతుంటాం.అందుకే ఇంట్లో పెంపుడు జంతువులుగా పిల్లుల్ని పెంచుకోవడానికి ఇష్టపడం.కానీ యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన శ్రీకాంత్, దుర్గ దంపతులు ఇంట్లో పిల్లుల్ని తమ సొంత బిడ్డల్లా పెంచుకుంటున్నారు.ఒకటో రెండో కాదు ఏకంగా 20 పిల్లుల్ని సాకుతున్నారు.అంతేకాదు తమ పిల్లలకు నామకరణం చేసినట్లు ఈ పిల్లులకు పేర్లు కూడా పెట్టుకున్నారు.వీరి కుమారుడు కృష్ణవంశీ ఓ సారి తల్లి చనిపోయిన పిల్లి కూన పాల కోసం తపిస్తుండగా.. ఇంటికి తీసుకువచ్చి సాకడం మొదలుపెట్టాడు.ఆ పిల్లి కూన పెరిగి పెద్దదై.. దాని పిల్లలు, పిల్లలకు పిల్లలు ఇలా మొత్తం 20 వరకు సంతానం పెరిగింది. ఇలా ఎనిమిదేళ్లలో వృద్ధి చెందిన పిల్లులు ప్రస్తుతం ఆ ఇంట్లో సందడి చేస్తున్నాయి.పిల్లుల ఆలనా పాలనా చూస్తున్న వీరు తమ పిల్లలకు మాదిరిగానే వీటికి క్రమశిక్షణ కూడా నేర్పించారు.మొదట్లో ఈ కుటుంబం పిల్లులను పెంచడాన్ని చుట్టుపక్కల వాళ్లు వ్యతిరేకించారు.రాను రాను వీరి జంతు ప్రేమను వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. మానవ సంబంధాల కంటే కల్మషం లేని పిల్లుల ప్రేమే బెటర్ అని ఈ దంపతులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com