TGSPDCL App : విద్యుత్ యాప్‌తో 20 మెరుగైన సేవలు

TGSPDCL App : విద్యుత్ యాప్‌తో 20 మెరుగైన సేవలు
X

ఇప్పటికే ఉత్తర విద్యుత్ సంస్థ 20 రకాల సేవలను అందించేయపన్ను అందుబాటులోకి తెచ్చి విజయవంతం కావటంతో దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ సైతం అదే తరహాలో ఓ సరికొత్త యాప్ల ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల సమయం, పనుల పారదర్శకతను దృష్టిలో పెట్టుకొని ఒకే యాప్లో 20 రకాల సేవలు పొందేలా అవకాశం కల్పించింది. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగినా, సిబ్బంది అందుబాటులో లేకపోయినా, బిల్లులో సందేహాలున్నా, ఏ చిన్న సమస్య వచ్చినా యాప్ ద్వారానే పరిష్కారం పొందేందుకు వీలు కల్పించింది.

నివాస గృహంలోని విద్యుత్తు మీటరు, పంట పొలానికి నీరందించే బోరుబావికి కొత్త సర్వీసు ఎలా పొందాలనే విషయాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకుంటే అది మంజూరయిందా? లేదా ఏ దశలో ఉందో కూడా తెలుసుకునే వెలుసుబాటును టీజీ ఎస్పీడీసీఎల్ ఇందులో కల్పించింది. సర్వీస్ కెపాసిటీ పెంచాలన్నా, మీటర్లో ఏవైనా లోపాలున్నా మార్చుకునే వెసులుబాటు యాప్లో ఉంటుంది. ఇంటి నుంచి దుకాణం లేదంటే వ్యాపారం నుంచి గృహం కేటగిరీ మార్చుకునే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా యాప్లో అప్లికేషన్ పెడితే సరిపోతుంది.

విద్యుత్తు మీటర్ కు స్పాట్ బిల్లింగ్ చేసే వ్యక్తి సరైన సమయంలో రాకుంటే సొంతంగా బిల్లింగ్ చేసుకునే అవకాశం ఈ యాప్ లో ఉంది. వినియోగదారుడు వాడిన విద్యుత్తును తానే లెక్కించుకునే అవకాశం ఉంది. ప్రతి నెలా బిల్లుల చెల్లింపులు, గతంలో చెల్లించిన వివరాలు సైతం దీంట్లో తెలుసుకోవచ్చు. తాజాగా వచ్చిన బిల్లును నేరుగా యాప్ నుంచే చెల్లించవచ్చు. విద్యుత్తు సరఫరాలో లోపాలు ఇతర సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు.

Tags

Next Story