KTR : ఆ కుటుంబాలకు 20లక్షలు ఇవ్వాలి.. కేటీఆర్ డిమాండ్

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్నారు. కల్తీ కల్లు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.20లక్షల ఆర్థికసాయం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నొక్కి చెప్పారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ బుల్డోజర్ అంటూ కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గాలికొదిలేసి, ప్రజలు అడగని బుల్డోజర్ పాలనను తెచ్చిందని ఆరోపించారు. పేదలకు రూ.4 వేల పెన్షన్, మహిళలకు మహాలక్ష్మి పథకం, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు వంటి హామీలన్నీ ఏమయ్యాయని నిలదీశారు. మహానగరం నుంచి మారుమూల పల్లెల వరకు బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని, తెలంగాణ ప్రజలు మేల్కోవాలని ‘‘జాగో తెలంగాణ జాగో’’ అంటూ కేటీఆర్ ‘ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com