TG : మందు బాబులకు రూ.41 వేల జరిమానా

TG : మందు బాబులకు రూ.41 వేల జరిమానా
X

పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో, రాజీవ్ రహదారిపై గత కొన్ని రోజులుగా సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాలు నడుపుతున్న 22 మందిని బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని సిద్దిపేట ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బుధవారం సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ముందు హాజరపరచగా 22 మందికి రూ 41వేల రూపాయల జరిమాన విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడవదని, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

Tags

Next Story