TG : ఇరిగేషన్ కు రూ.28 వేల కోట్లు.. ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. భీమా, నారాయణపేట -కొడంగల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు సకాలంలో పనులు చేస్తున్నారా లేదా అని మంత్రి ఆరా తీశారు. ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, భీమా, నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టుల తాజా పరిస్థితులపై ఉత్తమ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితిపై చర్చించారు. ప్రాజెక్టుల పూర్తికి ఏ చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తామన్నారు. ఇతర ప్రాజెక్టుల పూర్తి చేయడంపై కూడా చర్చించినట్లు తెలిపారు. బడ్జెట్‌లో ఇరిగేషన్ శాఖకు రూ.28 వేల కోట్లు కేటాయించాలని కోరతామన్నారు. రూ.8 వేల కోట్లు కొత్త ప్రాజెక్టుల పనుల కోసం కేటాయించినట్లు ఉత్తమ్ తెలిపారు. ఈ సంవత్సరం పనుల విస్తరణ కోసం రూ.11 వేల కోట్లు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆరున్నర లక్షల కొత్త ఆయకట్టును తీసుకురానున్నట్లు తెలిపారు. ముఖ్యమైన ప్రాజెక్టులను ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేస్తామన్నారు. అందుకోసం ఆర్థిక శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com