Telangana Holidays : రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు

తెలంగాణలో ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు, పలు విద్యాసంస్థలకు రేపటి నుంచి ఈ నెల 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి. 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండనున్నాయి. ఆ తర్వాత 18న గుడ్‌ఫ్రైడేకు హాలిడే ఉంది. ప్రస్తుతం ఒంటిపూట బడులు జరుగుతున్న నేపథ్యంలో రెండో శనివారం పలు స్కూళ్లు సెలవు ఇవ్వడం లేదు. అలాంటి వాటికి 13, 14న రెండ్రోజులు సెలవులు ఉంటాయి.
అయితే ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. చాలా సంస్థలు శని, ఆదివారాలను రెగ్యులర్‌గా సెలవులుగా ప్రకటించినందున, వాళ్లకు ఈ మూడు రోజులు కన్ఫర్మ్ సెలవులు. సోమవారం అంబేద్కర్ జయంతికి కూడా సెలవు ఉండటంతో, మధ్యలో శుక్రవారం మాత్రమే మేనేజ్ చేస్తే చాలు – పూర్తిగా లాంగ్ బ్రేక్ ఎంజాయ్ చేయవచ్చు.
కాగా ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎండల నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లు ఒక్కపూటనే నడుస్తున్నాయి. మార్చి 15 నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ స్కూళ్లు నడుస్తున్న విషయం విదితమే. తెలంగాణలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com