Telangana: పీకే ఎంట్రీతో తెలంగాణలో 3 పార్టీల మధ్య యుద్దం..

Telangana: ఎవరు ఎవరికి దోస్త్‌లు.. ఎవరు ఎవరి దుష్మన్‌లు..! తెలంగాణలో ఎన్నికలకు ఏడాది ముందే పీక్స్‌కి వెళ్లిపోయిన పొలిటికల్ హీట్ మంటలు పుట్టిస్తోంది. BJP, కాంగ్రెస్, TRS పార్టీల అగ్ర నేతల ప్రకటనలు, విమర్శలు అన్నీ రాజకీయాన్ని మరింత రసకందాయంగా మార్చేస్తున్నాయ్. ముఖ్యంగా PK ఎంట్రీ ఇచ్చి.. ప్రగతి భవన్‌లో KCRతో చర్చలు జరపడంతో ఏమి జరగబోతోందోననే ఉత్కంఠ అందర్లో కనిపిస్తోంది.
ఒకటైతే క్లియర్. ఐప్యాక్ సంస్థ TRS కోసం పనిచేస్తుంది. ఈ విషయాన్ని మొన్న టీవీ5 ఇంటర్వూలోనూ, ఇవాళ మరోసారి KTR స్పష్టం చేశారు. ఐతే.. కాంగ్రెస్‌లో చేరబోతున్న PK.. ప్రత్యర్థి పార్టీ కోసం ఎలా పనిచేస్తారు అనేదే అంతు చిక్కని ప్రశ్న. అసలు లాస్ట్ వీకెండ్‌లో PK హైదరాబాద్ వచ్చిందే వ్యూహకర్తగా TRSతో తెగతెంపులు చేసుకోవడానికే అనేది కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి వాదన.
ఐతే.. ఈ రెండు పార్టీలు చెప్తోంది, చేస్తోంది వట్టి డ్రామానే అంటున్న BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా TRS- కాంగ్రెస్ మధ్య పొత్తు కూడా ఖాయమైపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో TRSతో జట్టు కట్టి కాంగ్రెస్ 31 ఎమ్మెల్యే స్థానాల్లో, 4 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్-TRS మధ్య పొత్తు పేరుతో వస్తున్న వార్తలు తమకు డ్యామేజ్ చేస్తాయని ముందే గ్రహించిన PCC చీఫ్ రేవంత్‌రెడ్డి ఈ ఆరోపణల్ని ఖండించారు. TRS దొంగల బ్యాచ్‌తో తామెందుకు కలుస్తామంటూ ప్రశ్నించారు. BJPని, TRSని ఓడించేది కాంగ్రెస్సేనన్నారు.
మంత్రి కేటీఆర్ కూడా ఈ పొత్తులు, కత్తులపై మాట్లాడారు. భవిష్యత్తే లేని కాంగ్రెస్‌తో కలవాల్సిన అవసరం తమకు అస్సలు లేదన్నారు. అదేటైమ్‌లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ BJP నేతల్నీ గట్టిగా నిలదీశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యమ్నాయం లేదని స్పష్టం చేశారు. పీకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పలేదే అంటూనే భవిష్యత్‌లో ఏమవుతుందో చూద్దామన్నారు. పొత్తుల వార్తల్ని తోసిపుచ్చిన ఆయన.. ఐప్యాక్ సేవల్ని కంటిన్యూ చేస్తామని వివరణ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com