TG : హన్మకొండ, వరంగల్ జిల్లాలో 30 కాలనీలు జలదిగ్బంధం

TG : హన్మకొండ, వరంగల్ జిల్లాలో 30 కాలనీలు జలదిగ్బంధం

హనుమకొండ, వరంగల్ పరిధిలో దాదాపు 30 కాలనీలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. దీంతో అధికార యత్రాంగం అప్రమత్తమైంది. నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే, మేయర్, కలెక్టర్, కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. సత్వర సహాయక చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

వరద బాధితులకు సహాయక చర్యలు అందించడానికి బల్దియా ఆధ్వర్యంలో 25 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రధానంగా ముంపు ప్రభావంతో చిక్కుకున్న 6 ప్రాంతాల్లో బాధితులకు ఆశ్రయం కల్పించారు. ఈ ముంపు ప్రాంతాల్లోని పలు కాలనీల్లో నీరు కొంత తగ్గుముఖం పట్టిన పూర్తిగా బురదమయ్యాయి.

Tags

Next Story