Saraswati Pushkarams : సరస్వతి పుష్కరాల్లో 30 లక్షల మంది పుణ్యసాన్నాలు

గత నెల 15 నుంచి ఈ నెల 26 వరకు జరిగిన కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు విజయవంతమయ్యాయని, 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని రాష్ట్ర అటవీ, పర్యా వరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పా రు. తాను దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న ప్పుడు పుష్కరాలు రావడం వ్యక్తిగతంగా చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత తొలి సారిగా సరస్వతీ పుష్క రాలు వచ్చాయని, ఈ పుష్కరాలు అద్భుతంగా జరిగాయన్నారు. తెలం గాణ నుంచే గాక, ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్ ఘఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, కాళేశ్వర ముక్తీశ్వరుడి దర్శనం చేసుకున్నారని పేర్కొన్నారు. పుష్కరాలు విజయ వంతం కావడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు.. రాబోయే రోజుల్లో వచ్చే గోదావరి పుష్కరాలను మరింతగా గొప్పగా జరుపు కుందామని చెప్పారు. ఈ పుష్కరాలు విజయవంతం కావటానికి అహోరాత్రులు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు,, స్థానిక అధికారులు, దేవాదాయశాఖ సిబ్బందికి మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com