TG : త్వరలో హైడ్రాలో 3వేల పోస్టుల భర్తీ?

TG : త్వరలో హైడ్రాలో 3వేల పోస్టుల భర్తీ?
X

అమెరికాలో పర్యటించిన తెలంగాణ సీఎం రేవంత్ బృందం మొత్తం ₹31,500 కోట్ల పెట్టుబడులు రాబట్టినట్లు సీఎంవో వెల్లడించింది. దాదాపు 19 కంపెనీలు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో కాగ్నిజెంట్, అమెజాన్, చార్లెస్ స్క్వాబ్, ఆమ్జెన్, మోనార్క్ ట్రాక్టర్, జొయిటిస్, HCA హెల్త్ కేర్, వివింట్ ఫార్మా వంటివి ఉన్నాయి. వీటి వల్ల రాష్ట్రంలో కొత్తగా 30,750 ఉద్యోగాలు లభించనున్నాయి. మరోవైపు హైదరాబాద్ విపత్తుల స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ(హైడ్రా)కు కొత్త పోస్టుల మంజూరు అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ 3వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిలో కొన్నింటిని నియామకాల ద్వారా, మిగతా వాటిని GHMC, HMDAలోని అదనపు పోస్టులతో భర్తీ చేస్తారని సమాచారం. త్వరలో దీనిపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ భూములను పరిరక్షించడమే హైడ్రా లక్ష్యం.

Tags

Next Story