Telangana : పాడి కౌశిక్ రెడ్డికి 32 ప్రశ్నలు

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మె ల్యే పాడి కౌశిక్ రెడ్డి మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి పీఎస్ లోపలికి వెళ్లారు. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలి గించిన కేసులో ఆయన్ను గంటపాటు విచారిం చారు. అనంతరం స్టేట్ మెంట్ రికార్డు చేశారు. గతేడాది డిసెంబర్ 4న ఫోన్ ట్యాపింగ్ జరిగిం దని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు కౌ శిర్రెడ్డి వెళ్లారు. సీఐ వాహనానికి తన వాహనం అడ్డుపెట్టి అనుచరులతో హల్చల్ చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగిం చారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 హామీలు పై ప్రశ్నిస్తే తనపై కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిర్రెడ్డి ఆరోపించారు. మాసబ్ ట్యాంక్లో విచారణ ముగిసిన అనంతరం కౌశిర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. 'ఇవాళ మాసబ్ ట్యాంక్ పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు. అడిగిన ప్రశ్నే అడిగారు.. నేను అన్నిటికీ సమాధానం చెప్పాను. గతంలో బంజారా హిల్స్లో పిటిషన్ ఇచ్చేందుకు సీఐ దగ్గరికి వెళ్తే ఆయన లేచి పరుగులు పెట్టబోయారు. పిటిషన్ ఇచ్చిన రెండు గంటల తర్వాత నాపై కేసులు నమోదు చేశారు. వందలాది మంది పోలీసులను మరుసటి రోజు నా ఇంటికి పంపించారు. డోర్లు పగులగొట్టి నా బెడ్రూమ్ దగ్గరికి వచ్చి అరెస్టు చేశారు. నా ఇంటి డోర్లు పగులగొట్టే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు? నా బెడ్రూమ్ దగ్గరికి వచ్చి అరెస్టు చేసేందుకు నేను క్రిమిసల్నా?” అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com