TRS Plenary 2022 : టీఆర్ఎస్ ప్లీనరీలో 33 రకాల పసందైన వంటకాలు..!

TRS Plenary 2022 : టీఆర్ఎస్ ప్లీనరీలో 33 రకాల  పసందైన వంటకాలు..!
TRS Plenary 2022 : అయితే ప్లీనరీకీ హాజరయ్యే అతిధుల కోసం గులాబీ బాస్ కేసీఆర్ ఏకంగా 33 ర‌కాల వెరైటీల‌ను ప్రిపేర్ చేయిస్తున్నారు..

TRS Plenary 2022 : టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి అంతా సిద్దమైంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.. అయితే ప్లీనరీకీ హాజరయ్యే అతిధుల కోసం గులాబీ బాస్ కేసీఆర్ ఏకంగా 33 ర‌కాల వెరైటీల‌ను ప్రిపేర్ చేయిస్తున్నారు..

33 ర‌కాల వెరైటీలు ఇవే..

డబుల్‌కామీట, గులాబ్‌జామ్‌, మిర్చిబజ్జీ, రుమాలీ రోటీ, తెలంగాణ నాటు కోడి కూర, చికెన్‌ధమ్‌ బిర్యానీ, ధమ్‌కా చికెన్‌,

మిర్చి గసాలు, ఆనియన్‌ రైతా, మటన్‌కర్రీ, తలకాయ కూర, బోటీదాల్చా, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్‌, మిక్స్‌డ్‌ వెజ్‌ కుర్మా

వైట్‌ రైస్‌, మామిడికాయ పప్పు, దొండకాయ, కాజుఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాట కర్రీ

వెల్లిపాయ కారం, టమాట, కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చిపులుసు, ఉలువ చారు క్రీమ్‌,

టమాట రసం, పెరుగు, బటర్‌స్కాచ్‌ ఐస్‌క్రీమ్‌, ఫ్రూట్స్‌ స్టాల్‌, అంబలి, బటర్‌ మిల్క్‌.



కాగా గత అక్టోబర్‌లోనే టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ప్లీనరీ జరగ్గా.. ఆరు నెలల వ్యవధిలో మరో ప్లీనరీ టీఆర్ఎస్ నిర్వహిస్తోంది. రేపు ఉదయం పది గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు సహా మొత్తం 3 వేల మందికి ఆహ్వానం పంపారు. పురుషులు గులాబీ రంగు దుస్తులు, మహిళలు గులాబీ రంగు చీరల్లో హాజరుకావాలని ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది.

Tags

Next Story