TG : ప్రతి నియోజకవర్గానికి 4వేల ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి

రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చిత్తశుద్ధితో త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీకి అవసరమైన రూ.31వేల కోట్లతో పాటు ఆదనంగా రూ.500 కోట్లు ఇవ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సోమవారం కల్వకుర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. పల్లెల్లో, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ధరణి స్థానంలో బలమైన 2024 ఆర్‌ఓఆర్ చట్టం తీసుకురాబోతున్నామని అన్నారు. ప్రతి కుటుంబానికి డిజిటల్ గుర్తింపు కార్డులను ఇచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యల తీసుకుంటున్నామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అర్హులకు కేటాయిస్తామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com