48వ రోజుకు చేరుకున్న భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర

48వ రోజుకు చేరుకున్న భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర
ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో కొనసాగుతుంది. 48వ రోజు యాదగిరి గుట్టకు చేరుకుంది. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీ నరసింహా స్వామివారిని దర్శించుకున్నారు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో కొనసాగుతుంది. 48వ రోజు యాదగిరి గుట్టకు చేరుకుంది. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీ నరసింహా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం పాదయాత్ర చేస్తూ ఆటో కార్మికుల నిరాహార దీక్ష సభ వద్దకు చేరుకున్నారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆటో కార్మికులు చేపట్టిన నిరాహార దీక్ష 405 రోజులకు చేరినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులకు భట్టి విక్రమార్క సంఘీభావం తెలియజేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కొండపైకి ఆటోలను అనుమతిస్తా మని భరోసా కల్పించారు.

Tags

Next Story