TG : 50శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.. కాంగ్రెస్ పాలనపై భట్టి ఆసక్తికరమైన స్పందన

TG : 50శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.. కాంగ్రెస్ పాలనపై భట్టి ఆసక్తికరమైన స్పందన
X

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణ అంశం కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆశావహులు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. మంత్రివర్గంలో చోటు ఇవ్వాలంటూ హైకమాండ్‌కు మల్‌రెడ్డి రంగారెడ్డి లేఖ రాసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకస్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై హైకమాండే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాలనపై ప్రజలు వందశాతం సంతోషంగా ఉంటారనుకోవట్లేదన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని చెప్పారు.

Tags

Next Story