TG : ఔటర్ మున్సిపాలిటీల్లో 51 గ్రామ పంచాయతీలు విలీనం

TG : ఔటర్ మున్సిపాలిటీల్లో 51 గ్రామ పంచాయతీలు విలీనం
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరించే దిశగా కీలక చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని ఔటర్ రింగ్ రోడ్ గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ గెజిట్ విడుదల చేశారు.

క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని 51 గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో.. పట్టణ ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ప్రభుత్వం డిసైడైంది.

Tags

Next Story