Crime : పిడుగుపాటుకు తెలంగాణలో 9 మంది మృతి..

Crime : పిడుగుపాటుకు తెలంగాణలో 9 మంది మృతి..
X

ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో, ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడి రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆకస్మిక ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

గద్వాల జిల్లా అయిజ మండలం భూంపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తున్న ముగ్గురు కూలీలు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. వీరిలో సర్వేసు (24), పార్వతి (34), సౌభాగ్య (36) ఉన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం, గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామంలో తమ పొలంలో కలుపు తీస్తున్న ముగ్గురు రైతులు పిడుగుపాటుకు బలయ్యారు. మృతులు ఆలకుంట ఎల్లయ్య (37), ఆయన భార్య లక్ష్మి (32), మేనమామ బండారి వెంకన్న (50)గా గుర్తించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాటుకు ఒక రైతు ప్రాణాలు కోల్పోయారు. మృతుడు గుండాల మండలం, చీమ గూడెం గ్రామానికి చెందిన పాయం నర్సయ్య (50) గా గుర్తించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం, సత్యనారాయణపురం గ్రామంలో పశువులను మేపుతున్న మహేష్ (32) ... మధిర సమీపంలోని మడిపల్లి గ్రామానికి చెందిన రైతు గడిపూడి వీరభద్ర రావు (50) కూడా పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయారు. వర్షాల ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో బయటకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags

Next Story