kukatpally : కూకట్పల్లిలో 12 ఏళ్ల బాలిక దారుణ హత్య

హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతంలో జరిగిన ఒక దారుణ సంఘటనలో 12 సంవత్సరాల బాలిక హత్యకు గురైంది.ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ బాలికపై దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం తెలుస్తోంది. బాలిక తండ్రి బైక్ మెకానిక్‌గా తల్లి ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లిదండ్రులు, తిరిగి వచ్చేసరికి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సంఘటన స్థలానికి చేరుకున్న బాలనగర్ డిసిపి సురేష్ కుమార్ నేతృత్వంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తోంది. బాలిక చంపబడిన ప్రాంతంలో గానీ, అపార్ట్‌మెంట్‌లో గానీ, చుట్టుపక్కల గానీ ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేనట్లు తెలుస్తోంది. బాలికపై కత్తిపోట్లు మాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్స్ పోలీసుల పరిశీలనలో బాలికపై రేప్ ఆనవాళ్లు ఎక్కడా లేవు. బాలిక నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈరోజు స్కూల్‌కు సెలవు కావడంతో బాలిక ఇంట్లోనే ఉంది. ఆమె బోయినపల్లి కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. ఈ సంఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com