VC Sajjanar : వీసీ సజ్జనార్ కు ఘనంగా వీడ్కొలు

VC Sajjanar : వీసీ సజ్జనార్ కు ఘనంగా వీడ్కొలు
X

నాలుగు సంవత్సరాల TGSRTC ప్రయాణం తర్వాత ఇప్పుడు బస్సు దిగి కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం ఆసన్నమైందని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. TGSRTC ఎండీగా ఉన్న సజ్జనార్ ను హైదరాబాద్ సీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రయాణాలు ఆగిపోవచ్చు, కానీ ప్రయాణికులు ముందుకు సాగుతూనే ఉంటారు. ఇప్పుడు నా బస్సును పార్క్ చేసి తదుపరి సవాల్ దిశగా ప్రయాణం వేగవంతం చేయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేసిన ప్రతి ఉద్యోగికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్టీసీ కళాభవన్ లో జరిగిన వీడ్కోలు సమావేశంలో సజ్జనార్ ను ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.

Tags

Next Story